శుక్రవారం 14 ఆగస్టు 2020
Devotional - Jan 12, 2020 , 00:18:40

నైతిక విలువలే పునాదిగా..

నైతిక విలువలే పునాదిగా..

స్వాతంత్య్రం అనంతరం ఏడు దశాబ్దాలు గడిచినా ఆనాటి మహానుభావులెందరో కలలు కన్న ఆదర్శవంతమైన సమాజస్థాపన కలగానే ఉండిపోయింది. ఆధునిక భారతదేశం సాధించలేకపోయిన ‘విలువలతోకూడిన విద్యావిధానం’ వాటిలో ఒకటి. ఇది లోపించిన కారణంగానే యువతలో చెడు ప్రవర్తన, వక్రమార్గం పట్టడం, నేరప్రవృత్తి, బాధ్యతా రాహిత్యం పెరగడం, సేవాభావం, పెద్దలపట్ల గౌరవం, దైవభక్తి, సంస్కృతి వారసత్వాల కొనసాగింపు వంటి అనేక లోపాలు, అవగుణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నైతిక విలువలతో కూడిన విద్యావిధాన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాలయాలలో పాఠ్యాంశాల రూపకల్పన జరుగుతుందని ఇటీవల ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. సమాజంలో ఉత్తమ పౌరుల ఎదుగుదలలో నైతిక విలువలు, ధర్మబద్ధ వ్యవస్థల పాత్ర, వాటి ఆవశ్యకత ఎంతో ఉందని చెబుతూ, ఇందుకుగాను ప్రముఖ ధార్మికవేత్తల సలహాలు కూడా తీసుకొంటామని ఆయన అన్నారు. అయితే, ప్రపంచానికి ఉత్తమ, ఉదాత్తమైన మానవ జీవన వికాసానికి కావలసిన అత్యున్నత ధార్మిక మార్గాలను మన భారతీయ విద్యావిధానం అందించింది. వాటిలో భాగంగానే విద్యార్థులలో నైతిక విలువలకు పెద్దపీట వేసిన సందర్భాన్ని గుర్తించాలి.


logo