e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home చింతన ‘ఆత్మ జ్ఞానం’ ఎలా?

‘ఆత్మ జ్ఞానం’ ఎలా?

‘ఆత్మ జ్ఞానం’ ఎలా?

‘మానవజన్మకు లక్ష్యం ఏమిటి? మనం ఎందుకు జన్మించాం? ఈ జన్మలోనే పరమాత్మను ఎలా చేరుకోగలం?’ ఈ ప్రశ్నలకు ‘భగవద్గీత’ చక్కని సమాధానాలను ఇచ్చింది. జీవితాన్ని సన్మార్గంలో అంటే, పరమాత్మ చూపిన బాటలో సాగించేవారికి ఆయనే మెల్లమెల్లగా వెలుగునిస్తాడు. ఇది అందరికీ ఒక్క జన్మలో సాధ్యం కావాలని లేదు. నారదాది మునిముఖ్యులు కూడా ఆయన మాయలో చిక్కుకున్నవారే. మనవంటి సాధారణ మానవులెంత!
బుద్ధిః జ్ఞానమ సమ్మోహః క్షమా సత్యం దమః శమః
సుఖం దుఃఖం భవో‚ భావో భయం చాభయమేవ చ॥

 • భగవద్గీత (10-4)
  అహింసా సమతా తుష్టిః తపో దానం యశో‚ యశః
  భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః॥
 • భగవద్గీత (10-5)
  ‘బుద్ధి కుశలత (నిశ్చయాత్మక శక్తి), యథార్థ జ్ఞానం, మోహ రాహిత్యం, క్షమ, సత్యము, దమము (ఇంద్రియ నిగ్రహం), సుఖదుఃఖాలు, జనన మరణాలు, భయం, ధైర్యం, అహింస, సమత్వం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి మొదలైనవి మనుషుల్లో లేదా ప్రాణుల్లో ఉండే గుణాలలోని పలు వైవిధ్యాలు. ఇవన్నీ నా నుంచే జనిస్తున్నాయి. ఆయా వ్యక్తుల్లో ఈ రకమైన వివిధ గుణాలు ఏవైనా నేను అనుమతించిన మీదట, ఆ మేరకు మాత్రమే వ్యక్తమవుతుంటాయి’ అని శ్రీ కృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. కాబట్టి, ఆయనే సర్వప్రాణుల మంచి-చెడు స్వభావాల మూలమని తెలుసుకోవాలి. ఆయన అనుగ్రహం వల్లే సద్గురువుల బోధలు మనకు సంప్రాప్తిస్తాయి. అప్పుడు వారి ద్వారా అదృష్టం కలిసివస్తే ‘ఆత్మ జ్ఞానమూ’ సిద్ధిస్తుంది.
  ‘పరమాత్మ’ ఒక గొప్ప విద్యుచ్ఛక్తి అనుకుంటే, ఇది వేర్వేరు ఉపకరణాల ద్వారా ప్రసరించినప్పుడు వివిధాలుగా ఫలితాలను ఇవ్వడం మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఒకదాంట్లో శబ్దాన్ని (కాలింగ్‌ బెల్‌), మరోదాంట్లో గాలిని (ఫ్యాను), వేరొక దాంట్లో వెలుగుని (లైట్‌), ఇంకొక దాంట్లో వేడిమిని (హీటర్‌), ఇంకా చల్లదనాన్ని (ఏసీ) ఇలా వివిధ పరికరాల్లో పలురకాలుగా ఫలితాలను విద్యుచ్ఛక్తి పుట్టిస్తుంది. ఇలా వేర్వేరు రకాలుగా వ్యక్తమైనా వాటి మూలాధారం మాత్రం ఒక్కటే (విద్యుచ్ఛక్తి) కదా.
 • ఇదేవిధంగా, మన పూర్వ, ప్రస్తుత జన్మల పురుషార్థాన్ని బట్టి (స్వేచ్ఛా చిత్తంతో చేసే పనులు) భగవంతునిచే ఇవ్వబడిన శక్తి మనలో మంచిగానో లేదా చెడుగానో వ్యక్తమవుతుంది. సన్మార్గంలో ప్రవర్తించేవారికి లేదా పరమాత్మను తెలుసుకోవాలని, పరతత్త్వం తప్ప వేరొకటి తెలుసుకోవలసిన అవసరం లేదన్నట్లుగా ప్రవర్తించేవారికి ఆయా మార్గాలను ఆయనే ఏర్పరుస్తారు. ఈ సాధనలో భయం, దుఃఖం, సంతోషం, విచారం.. ఇలా అన్నిరకాల గుణాలూ కలుగుతూ, అడ్డంకులను సృష్టిస్తుంటాయి. అప్పుడు కష్టాలకు క్రుంగక, సుఖాలకు పొంగక, ‘ఇవన్నీ ఆయన లీలా ప్రసాదాలే’ అని గుర్తుంచుకున్న సాధకునికి మెల్లమెల్లగా అసలు తత్త్వం, అది కూడా ఆ పరమాత్మ ద్వారానే ఎరుకలోకి వస్తుంది.
  ఇదంతా జరగాలంటే మానవులకు సద్గురువు ఆవశ్యకత తప్పనిసరి. వారు తమ శిష్యులకు అవసరమైన మేరకు సద్బోధలతో సన్మార్గాన్ని నిర్దేశిస్తారు. అలా సాధన చేసేవారిని ఆ సద్గురువు రూపంలోని ‘పరమాత్మ’నే ఆదుకుంటాడు. ఆయా సాధకుల ప్రయత్న తీవ్రతను బట్టి గురువు మీద, పరమాత్మ మీద ఉన్న శ్రద్ధ, సబూరీ వల్ల చివరకు ‘ఆత్మజ్ఞానం’ కలుగుతుంది. అలా, పరమాత్మను తెలుసుకొని ఆయనలో లీనమవడమే మానవజన్మ యొక్క పరమార్థం. పునరావృతి రహితంగా, శాశ్వతంగా ఆయన చరణాల వద్దకు చేరడమే మానవజన్మ లక్ష్యం.

-లంక శివరామకృష్ణశాస్త్రి

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
‘ఆత్మ జ్ఞానం’ ఎలా?
‘ఆత్మ జ్ఞానం’ ఎలా?
‘ఆత్మ జ్ఞానం’ ఎలా?

ట్రెండింగ్‌

Advertisement