ప్రేమ వైఫల్యంతో యువకుడి ఆత్మహత్య

Tue,September 18, 2018 09:48 PM

younger suicide due to love failure

హైదరాబాద్: ప్రేమ వైఫల్యంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి శ్రీ శుభమస్తు అపార్ట్‌మెంట్‌లో బేతి సులోచన తన కుటుంబంతో సహా నివసిస్తోంది. తన చిన్న కొడుకు బేతి నట్‌రాజ్‌రెడ్డి (25) పంజాగుట్ట నిమ్స్ ఎదురుగా ఉన్న అనుకార్ ఫార్మసీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 9న ఉదయం పది గంటలకు ఇంటి నుంచి వెళ్లిన నట్‌రాజ్‌రెడ్డి, సుమారు పన్నెండు గంటల సమయంలో ఇంటికి ఫోన్ చేసి తాను వచ్చేందుకు ఆలస్యమవుతుందని చెప్పాడు. కానీ ఆ రోజంతా ఇంటికి తిరిగి రాలేదు. అతడి మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. దాంతో అతడు పనిచేసే అనుకార్ ఫార్మసీకి వెళ్లి విచారించగా, నట్‌రాజ్‌రెడ్డి విధులకు హాజరుకాలేదని తెలిసింది. సాధ్యమైన అన్ని ప్రదేశాలలో విచారించినప్పటికీ ఫలితం లేకపోయింది.

నట్‌రాజ్‌రెడ్డి ఒక అమ్మాయితో ప్రేమలో విఫలం చెందడంతో అప్పటి నుంచి మానసికంగా దెబ్బతిన్నారు. దీనిపై తన కుమారుడు కనపడడం లేదని ఈ నెల 11న చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో సులోచన ఫిర్యాదు చేసింది. ఓయూ గెస్ట్‌హౌజ్ వెనుకవైపు ఉన్న పీజీఆర్‌ఆర్‌సీడీఈ పార్కింగ్ ప్రదేశంలో గుర్తు తెలియని మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిద్రమాత్రలు కానీ మరేదైనా విషం తీసుకుని నట్‌రాజ్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అభిప్రాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

7174
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles