బాలికను వేధిస్తున్న యువకుడికి జైలు

Fri,April 5, 2019 06:40 AM

younger sent to jail due to harassing the girl

హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలిక వెంటపడి వేధిస్తున్న ఓ యువకుడికి రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని నాంపల్లి 10వ అదనపు న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి మోతీనగర్ అవంతినగర్ తోటలో నివాసం ఉంటున్న జాదవ్ బాబులాల్ ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న ఓ మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. కాగా, ఆమె ఫోన్ నంబర్ తీసుకొని ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో యువకుడిని పలుమార్లు మందలించారు. పద్ధతి మార్చుకోకపోవడంతో నెల రోజులు క్రితం ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు పరిశీలించిన న్యాయమూర్తి జాదవ్ బాబులాల్‌కు రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు.

3015
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles