స్నానం విషయంలో ఘర్షణ..

Wed,April 24, 2019 06:57 AM

Younger Brother Attacked Elder Brother With Knife

చాదర్‌ఘాట్: అన్నదమ్ముల మధ్య స్నానం విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం ప్రకారం... పాత మలక్‌పేట కాగజ్ కార్ఖానా ప్రాంతానికి చెందిన మందల వెంకట వంశీ(22), శ్రీనాథ్(18) అన్నదమ్ములు. వీరిద్దరు చదువుకుంటున్నారు. సోమవారం రాత్రి వీరిద్దరి మధ్య స్నానం విషయంలో స్వల్ప వివాదం జరిగింది. ఈ వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. తీవ్ర కోపంతో తమ్ముడు శ్రీనాథ్ ఒక్కసారి అన్నపై కత్తితో దాడికి దిగాడు. కత్తిపోట్లతో తీవ్ర గాయాలైన వెంకట వంశీని చికిత్స కోసం స్థానిక దవాఖానకు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

4171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles