రైలు ఢీకొని యువకుడి మృతి

Mon,October 21, 2019 07:21 AM

ఖైరతాబాద్ : రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నల్గొండ జిల్లా బొట్టుగూడకు చెందిన పోతపాక సాయిరాం (18) ఖైరతాబాద్‌లోని నెహ్రూనగర్‌లో నివాసం ఉన్న మేనమామ ఇంటికి తల్లితో కలిసి వచ్చాడు. మూత్ర విసర్జనకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల మీదుగా వెళ్లగా గుర్తుతెలియని రైలుఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఎస్‌కే షరీఫ్ పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.


శంషాబాద్‌లో పట్టాలపై వ్యక్తి మృతదేహం లభ్యం
శంషాబాద్ : శంషాబాద్(ఉందానగర్) రైల్వేస్టేషన్ పరిధిలోని రైలు పట్టాలపై ఆదివారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. శవం గుర్తు పట్టకుండా ముక్కలుకావడంతో పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles