భర్త వేధింపులు తట్టుకోలేక.. భార్య పరార్

Thu,April 18, 2019 06:46 AM

woman went disappeared due to husband harassment

మేడ్చల్ : మద్యం మత్తులో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక గృహిణి ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి మండలం, అడవి లింగాల గ్రామానికి చెందిన లలితాబాయి, లచ్చారాం దంపతులు గాజులరామారం సర్కిల్, సూరారం శ్రీక్రిష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. స్థానికంగా కూలీ పనులు చేస్తుంటారు. కాగా.. లచ్చారాం రోజూ మద్యం తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ విషయమై దంపతుల మధ్య గొడవ జరుగగా... ఆగ్రహానికి గురైన లచ్చారాం భార్యను తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లలితాబాయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. లలితాబాయి తండ్రి జాదవ్‌శ్యామ్యానాయక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

4410
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles