మహిళపై లైంగిక దాడి.. ఆపై హత్య

Sat,September 14, 2019 06:22 AM

woman was allegedly sexually assaulted, murdered

సైదాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై లైంగికదాడికి పాల్పడి.. అనంతరం దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ది. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ కథనం ప్రకారం... నల్గొండ జిల్లా మాల్ మండలం, ఉమ్మింతల పల్లి గ్రామానికి చెందిన ముదిగొండ చంద్రయ్య, అంజమ్మ(45) దంపతులు నగరానికి వలస వచ్చి బీఎన్ రెడ్డిలోని శారదానగర్‌లో నివాసముంటున్నారు. అయితే దంపతుల మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. దీంతో అంజమ్మ.. సైదాబాద్ చింతల్‌లో నివసించే సోదరి కూతురు మత్యాలమ్మ వద్ద ఉంటుంది. స్థానికంగా చెత్త కాగితాలు ఏరుకుని జీవనం కొనసాగిస్తుంది. చంపాపేట కల్లు కాంపౌడ్‌లో కల్లు తాగుతుంటుంది. కాగా.. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన అంజమ్మ.. తిరిగి రాలేదు.

ఇదిలా ఉండగా.. శుక్రవారం మధ్యాహ్నం వినయ్‌నగర్ కాలనీ, బీఎస్‌ఎన్ టెలిఫోన్ క్వార్టర్స్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో మహిళ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి వివరాలు, ఆధారాలు సేకరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై లెంగిక దాడికి పాల్పడి, అనంతరం గొంతునులిమి హత్యచేసి ఉండవచ్చనని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్య జరిగిన సంఘటన స్థలంలో క్లూస్ టీం, డాగ్ స్వాడ్ పోలీసులు ఆధారా లు సేకరించారు. నిందితుల కోసం సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

2628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles