వేధింపులు తాళలేక విషం తాగిన యువతి మృతి

Tue,April 16, 2019 04:38 PM

Woman died who suffered with love harassment in Hyderabad

హైదరాబాద్‌: ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపులు తాళలేక కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగిన యువతి మృతిచెందింది. ఈ ఘటన నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్‌-9లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషం తాగిన యువతిని చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో యువతి మృతిచెందింది. యువతి మృతికి రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి వేధింపులే కారణమని కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌లో మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. యువతి మృతదేహాన్ని అప్పగించాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరగా ఆస్పత్రి యాజమాన్యం చికిత్స అయిన మిగతా డబ్బులు చెల్లించాలని పేర్కొంది. దీంతో మృతదేహం అప్పగించాలంటూ ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

1983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles