వరుడి వయస్సు ఎక్కువగా ఉందని..

Wed,June 12, 2019 10:11 PM

woman   committed suicide

దస్తురాబాద్: తనకు కాబోయే భర్త వయస్సు ఎక్కువగా ఉందని, తనకు ఈ పెండ్లి ఇష్టం లేదని చెప్పినా వినకుండా వివాహం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై గుమ్ముల అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్ గ్రామానికి చెందిన శాఖాపురం కృష్ణవేణికి ఈ నెల 4న జగిత్యాల జిల్లా మెట్‌పెల్లికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 23న వివాహం చేయడానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే తనను పెండ్లి చేసుకునే యువ‌కుడి వయస్సు తనకంటే మరీ ఎక్కువగా ఉందంటూ కృష్ణవేణి తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. వారు నిరాకరించడంతో కృష్ణవేణి తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లోని మిషన్ కుట్టే గదిలో చున్నీతో ఉరివేసుకుంది. ఇంటి బయట రేకుల షెడ్డుకింద తల్లిదండ్రులు నిద్రించగా ఉదయం తండ్రి పోశన్న లేవగానే మంచంలో కూతురు కనిపించకపోవడంతో ఇంట్లోకి వెళ్లి గదిని పరిశీలించగా, చున్నీతో ఉరి వేసుకోని వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

6454
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles