పెళ్లికి యువ‌కుడు నిరాకరించడంతో.. యువతి

Tue,April 23, 2019 10:00 PM

Woman Attempts Suicide

కాచిగూడ: కొంత కాలంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినందుకు ఓ యువతి మనస్థాపం చెంది నెయిల్‌ పాలిశ్‌ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ జానకీరెడ్డి కథనం ప్రకారం.. తిలక్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్‌ కుమార్తె కె.లోచన(22) వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన దోసాపాటి సిద్దార్థతో 2017లో షాదీ డాట్‌ కామ్‌ ద్వారా పరిచయం ఏర్ప‌డింది.

ఫోన్‌లోనే కట్న, కానుకలు మాట్లాడుకుని వివాహం చేసుకుందామని నిశ్చయించుకున్నారు. గత కొన్నిరోజులుగా లోచన పెళ్లి విషయం ప్ర‌స్తావిస్తే చేసుకుందామని సిద్దార్థ దాటవేస్తూ వస్తున్నాడు. లోచన కుటుంబ సభ్యులు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 6.50 లక్షల వరకు కట్నం ఇస్తామని నచ్చజెప్పినా సిద్దార్థలో మార్పు రాలేదు. మా కుటుంబ సభ్యులకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని లోచనకు సిద్దార్థ చెప్పివాడు. దీంతో లోచన మనస్థాపం చెంది సోమవారం రాత్రి నెయిల్‌ పాలిశ్‌ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ దవాఖానకు యువ‌తిని తరలించారు. లోచన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అడ్మిన్‌ ఎస్సై వి.లక్ష్మయ్య తెలిపారు.

5081
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles