భర్తను కొట్టి చంపిన భార్య

Sat,June 16, 2018 09:04 AM

Wife killed her husband in Janagama district

హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వలిమిడిలో కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తను భార్య కొట్టి చంపింది. ఈ ఘటనలో కుమారుడు సైతం నిందితుడిగా ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని రామానుజావరం గ్రామంలో జరిగిన మరొక ఘటనలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా రఘనాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ.. కారును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

5254
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles