మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి

Fri,November 8, 2019 08:23 PM

మాల్: అర్ధరాత్రి సంచరిస్తున్న మతిస్థిమితం లేని వ్యక్తిని దొంగగా భావించిన గ్రామస్తులు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున నల్లగొండ జిల్లా మాల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన కడారి జంగయ్య(40)కు మతిస్థిమితం లేకపోవడంతో భార్య సంతోష తో పాటు బంధువులు అతడిని చింతపల్లి మండలం పీకే మల్లేపల్లిలోని అబ్బాస్ దర్గా వద్దకు తీసుకొచ్చారు. రాత్రి దర్గా వద్ద నిద్రచేస్తుండగా జంగయ్య గ్రామంలోకి వెళ్లాడు. దీంతో దొంగగా భావించిన గ్రామస్తులు ఓ ఇంట్లోకి వెళ్లిన జంగయ్యపై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. మరోవైపు దర్గా వద్ద నిద్రలేచిన బంధువులు జంగయ్య కోసం గ్రామంలో గాలిస్తుండగా తీవ్ర గాయాలతో కన్పించడంతో ఇబ్రహీంపట్నం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. జంగయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. దర్గా వద్ద నిద్ర చేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని వస్తే.. ప్రాణాలే పోయాయని కన్నీరుమున్నీరయ్యారు. సంతోష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వేమిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు.

1379
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles