'నా ఫొటోలు.. వైరల్ అవుతున్నాయి'

Sun,June 10, 2018 07:10 AM

victim complained to the Cyber Crime Police

హైదరాబాద్: సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తున్నారని, అలా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరు తూ మయూర్ పాన్ షాప్ యజమాని చేతిలో మోసపోయిన బాధితురాలు శనివారం సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని, మాయమాటలతో ఆమెపై లైంగిక దాడి చేసి, అనంతరం మోసపూరితంగా రెండో వివాహనం చేసుకున్న మయూరి పాన్‌షాప్‌ల నిర్వాహకుడు ఉపేందర్‌వర్మపై, ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కాచిగూడ పోలీసులకు ఫి ర్యాదు చేయడంతో అతన్ని, అతనికి సహకరించిన స్నేహితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కొందరు సోషల్‌మీడియాలో పెట్టి, వాటిని సర్క్యులేట్ చేస్తున్నారంటూ బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రమేష్ ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలను తొలగించేందుకు ఫేస్‌బుక్‌కు లేఖరాస్తున్నామని, ఫొటోలు, యూఆర్‌ఎల్‌లు చెబితే వాటిని తొలగించేయిస్తామన్నారు.

4184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles