విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. వైస్ ప్రిన్సిపాల్‌పై కేసు

Sat,November 9, 2019 08:11 AM

చందానగర్: నారాయణ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పోలీసులు అతడిపై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. మియాపూర్ ఇన్‌స్పెక్టర్ సామల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరికి చెందిన ముఖేశ్ మదీనగూడ నారాయణ ఐఐటీ క్యాంపస్‌లో వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా ముఖేశ్ విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. విసుగు చెందిన విద్యార్థులు శుక్రవారం ధర్నా చేసేందుకు ప్రయత్నించగా సమాచారమందుకున్న పోలీసులు కళాశాలకు వెళ్లారు. కాగా ..అప్పటికే ముఖేశ్ తప్పించుకొని వెళ్లిపోయాడు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

1390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles