కోడలిని కిడ్నాప్ చేసిన మేనమామ రిమాండ్

Fri,December 21, 2018 06:52 AM

Uncle kidnaped his niece in hyderabad

హైదరాబాద్ : బంధాలు, బాంధవ్యాలు మానవతా విలువలు మరిచిన ఓ యువకుడు డబ్బుల కోసం తన మేనకోడలినే కిడ్నాప్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్, అనిత దంపతులు గత కొన్నేండ్ల క్రితం నగర శివారులోని కొంపల్లికి వలస వచ్చారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమార్తె(12) స్థానిక ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నది. అనిత సోదరుడు రఘురాం(20) కూలీ పని చేస్తూ వారింట్లోనే ఉంటున్నాడు. బుధవారం రాత్రి సదరు బాలికను కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశాడు. వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు కిడ్నాప్‌ను ఛేదించారు. పోలీసులు నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

2201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles