వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు విద్యార్థులు మృతి

Thu,March 14, 2019 10:54 AM

Two students died in different accidents

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్లు చోటుచేసుకున్న దుర్ఘటనల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో రహదారి పక్కన ఉన్న దిమ్మెను బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఓ విద్యార్థి మృతిచెందాడు. విద్యార్థులు పొన్నారం పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌ సాయినాథ్‌ కాలనీలో పాఠశాల బస్సు ఢీకొని రెండేళ్ల బాలుడు రోహన్‌ మృతిచెందాడు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles