ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతిWed,September 13, 2017 07:55 PM
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. మృతులను కొత్తగూడెంలోని మేదరబస్తీకి చెందిన దారావత్ రమేష్(33), దారావత్ రాము(27)గా గుర్తించారు.
అదేవిధంగా మరొక ఘటనలో ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి తీర్థాల మధ్యలో ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

828
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Union Budget 2018