వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Fri,March 22, 2019 10:30 PM

Two men died in different road accidents

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్లు చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని దుర్మరణం పాలైంది. అదేవిధంగా సంగారెడ్డి శివారులో జరిగిన దుర్ఘటనలో ఓ బాలుడు మృతిచెందాడు. ఆటో నుంచి జారిపడిన బాలుడి పైనుంచి లారీ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడిని జహీరాబాద్‌కు చెందిన ఆసిఫ్(16)గా గుర్తించారు.

468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles