వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

Thu,July 18, 2019 05:13 PM

Two men died in different road accidents

హైదరాబాద్‌: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మృతుడిని ఏర్గట్ల వైస్‌ ఎంపీపీ లావణ్య భర్త అశోక్‌గా గుర్తించారు. అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సాయినగర్‌ వద్ద అదుపుతప్పి రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

536
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles