నాలుగో అంతస్థు నుంచి ప‌డి యాంక‌ర్ మృతి

Fri,December 14, 2018 08:22 PM

TV anchor falls to death from fourth-floor flat

నోయిడా: ఓ యాంక‌ర్ అనుమానాస్పద స్థితిలో భవనం పైనుంచి కింద పడి మృతి చెందింది. రాజస్థాన్‌కు చెందిన న్యూస్ యాంక‌ర్‌ రాధికా కౌశిక్ ప్రమాదవశాత్తు తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థులోని తన ఇంటి బాల్కనీ నుంచి కిందపడటంతో మరణించినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 77లోని ఆంత్రిక్షు ఫారెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో గత నాలుగు నెలల నుంచి ఉంటోంది. ఈ ఘటన శుక్ర‌వారం వేకువజామున 3.30 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రాధికా న్యూస్ యాంకర్‌గా ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లో పనిచేస్తోంది. రాధికా మృతిపై ఆమె కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమెతో ఆ సమయంలో గదిలో ఉన్న మరో సహచర ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ గిరిజా శంకర్ త్రిపాఠి తెలిపారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాధికా సహచర యాంకర్ రాహుల్ అవాస్తీ ఆమె ఫ్లాట్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాధికతో గదిలో ఉంటున్న మరో ఇద్దరు మాత్రం ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ లేరు. ఆమె ఫ్లాట్ నుంచి పోలీసులు ఆల్కహాల్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాల్కనీలో ఏర్పాటు చేసిన రెయిలింగ్ తక్కువ ఎత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిందా లేక ఎవ‌రైనా అక్క‌డి నుంచి ఆమెను తోసేశారా అనే కోణంలో విచార‌ణ‌ చేస్తున్నారు.

13492
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles