సంతకాల ఫోర్జరీ కేసులో ఐదుగురికి మూడేళ్ల జైలు

Tue,March 13, 2018 07:14 PM

Three years jail to Five men in signature forgery case

పెద్దపల్లి: సంతకాల ఫోర్జరీ కేసులో కోర్టు ఐదుగురికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ ఘటన పెద్దపల్లిలో చోటుచేసుకుంది. పెద్దపల్లి ఆర్డీవో, తహసీల్దార్ల సంతకాల ఫోర్జరీ కేసులో ఐదుగురు వ్యక్తులు దోషులుగా తేలారు. ఇద్దరు వీఆర్వోలు, ముగ్గురు రైతులు వీరిలో ఉన్నారు. పాస్‌పుస్తకాల కోసం 2009లో ఆర్డీవో, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసిన కేసులో పెద్దపల్లి కోర్టు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది.

973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS