బైక్ ప్రమాదంలో ఇద్దరు.. హత్య ఘటనలో మరొకరు

Tue,October 22, 2019 08:06 AM

హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. సికింద్రాబాద్‌లోని విమలనగర్ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని దుండగులు వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మరొక ఘటనలో షామీర్‌పేట మండలం తుర్కపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు బైక్‌పై ప్రయాణిస్తున్న వీరు ప్రమాదానికి గురై మృతిచెందారు.

1298
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles