పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

Mon,October 23, 2017 08:07 PM

tenth student suicide in badepalli town

మహబూబ్‌నగర్ : జిల్లాలోని బాదేపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాదేపల్లి పట్టణంలోని గౌరీశంకర్ కాలనీలో నివాసం ఉంటున్న కొత్త గోపాల్ కుమార్తె కొత్త సంధ్య(16) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. ఆదివారం సంధ్య స్కూల్‌కు వెళ్లి వచ్చింది. రాత్రి 10 గంటల సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి పడుకుంది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం బాదేపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్ దవాఖానకు తరలించే ప్రయత్నంలో మార్గమధ్యలోనే మృతి చెందింది.

ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమంటూ పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు.

ఒత్తిడి తట్టుకోలేకనే..
10వ తరగతి విద్యార్థులపై ప్రైవేటు పాఠశాల యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంధ్య తండ్రి కొత్త గోపాల్ పోలీసుల విచారణ సందర్భంగా ఆరోపించారు. గ్రేడింగ్‌ల కోసం విద్యార్థులపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా తన కూతురు సంధ్య పాఠశాల అంటేనే భయమేస్తుందని తనతో వాపోయినప్పటికి తాము పట్టించేకోలేదని తెలిపారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయో వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులు తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరారు.

1559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles