ఈతకు వెళ్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

Sun,October 13, 2019 08:20 PM

కమలాపూర్‌: స్నేహితులంతా కలిసి సరదాగా ఈత కోసం వాగులోకి దిగిన క్రమంలో ఒకరు మృతి చెందిన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం అంబాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండలోని లష్కర్‌ బజార్‌కు చెందిన పుల్లూరి సన్నిత్‌ కుమార్‌(32) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నగరంలోని రెడ్డి కాలనికి చెందిన బాదేండ్ల శ్రీకాంత్‌, రాపర్తి రాజేశ్‌కుమార్‌, తాటికొండ రాధాకృష్ణ, నీలేటి సంతోష్‌ కుమార్‌ ఇతడి స్నేహితులు. వీరంతా ఆదివారం ద్విచక్ర వాహనాలపై కమలాపూర్‌ మండలం అంబాల గ్రామశివారులోని చెక్‌ డ్యాం వద్దకెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు చెక్‌డ్యాంలోకి దిగారు. వీరిలో సంతోష్‌కుమార్‌ మాత్రం తనకు పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. మిగతా నలుగురు ఈత కోసం వాగులోకి దిగారు. ఇంతలో సన్నిత్‌కుమార్‌ నీటిలో మునిగిపోవడంతో గమనించి స్నేహితులు అతడిని కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదాన్ని చూసిన స్థానికుడు గోనెల ప్రశాంత్‌ వాగులోకి దూకి బాదేండ్ల శ్రీకాంత్‌, రాపర్తి రాజేశ్‌కుమార్‌, తాటికొండ రాధాకృష్ణను కాపాడాడు. సన్నిత్‌ కుమార్‌ మాత్రం అప్పటికే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సన్నిత్‌కుమార్‌ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం వరంగల్‌ ఎంజిఎం దవాఖానకు తరలించారు.



1547
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles