హుక్కా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు : సీపీ

Sat,August 12, 2017 07:11 PM

take action on Hookah Parlours in Hyderabad, says CP Mahender reddy

హైదరాబాద్ : హైదరాబాద్‌లో హుక్కా కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. హుక్కా కేంద్రాలకు అనుమతిస్తారనే అపోహను యజమానులు వదులుకోవాలని చెప్పారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో హుక్కా కేంద్రాలు నిషేధమని స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, కాఫీ దుకాణాల్లో హుక్కా పంపిణీ చేస్తే చర్యలు తప్పవన్నారు సీపీ. కేంద్రం ఆదేశాలు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు హుక్కా కేంద్రాలు నిర్వహించకూడదని ఆదేశించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో హుక్కా కేంద్రాలుంటే పోలీసులపై కూడా చర్యలు తప్పవని మహేందర్ రెడ్డి హెచ్చరించారు.

516
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles