వసతి గృహంలో విద్యార్థి ఆత్మహత్య

Mon,November 11, 2019 09:19 AM

హైదరాబాద్: ప్రైవేట్ హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకెళ్తే.. అబ్దుల్లాపూర్‌మెట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి బీ-ఫార్మసీ చదువుతున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఈ ఘటనతో హాస్టల్‌లో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. హాస్టల్‌లో నివాసముంటున్న సహా విద్యార్థులు ఈ భయానక సంఘటన చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. హాస్టల్ యాజమాన్యం విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, అతడి సహచరుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ విషయం హాస్టల్ యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు తెలియపరిచింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1130
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles