కళాశాలకు మొబైల్ తీసుకొచ్చిందని విద్యార్థినిని..

Thu,November 14, 2019 11:00 AM

హైదరాబాద్: కళాశాలకు మొబైల్ తీసుకొచ్చిందని విద్యార్థినిని కళాశాల యాజమాన్యం మందలించింది. దీంతో ఆ బాలిక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉప్పలగూడ, శివాజీనగర్‌లో జరిగింది. శివాజీనగర్‌కు చెందిన జయలక్ష్మీ(17) బాలాపూర్‌లోని ఓ ప్రైవేట్ కలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా, విద్యార్థిని కాళాశాలకు మొబైల్ తెచ్చిందని గుర్తించిన కళాశాల యాజమాన్యం, ఆమె తల్లిదండ్రులను పిలిపించి మందలించారు. దీంతో, తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థిని బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు పొద్దున లేచి చూసేసరికి కూతురు విగతజీవిగా వేలాడడం చూసి కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1590
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles