బైక్ కొనివ్వ లేదని విద్యార్థి ఆత్మహత్య

Sun,October 21, 2018 09:11 PM

student has committed suicide

కెరమెరి : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ఖైరి గ్రామానికి చెందిన వాడై మహదేవ్(15) అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖైరికి చెందిన వాడై శంకర్, కమలాబాయి దంపతుల చిన్న కుమారుడు మహదేవ్ కెరమెరిలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. శనివారం తనకు బైక్ కొనివ్వాలని తండ్రిని కోరగా, ఇప్పుడే వద్దు.. వచ్చే ఏడాది కొనిస్తానని చెప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మహదేవ్ అదే రోజు ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. చేను నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కొడుకు వాంతులు చేసుకుంటుండడం చూసి అంబులెన్స్‌లో ఆసిఫాబాద్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలకు తీసుకెళ్లారు. మంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి వాడై శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.

1730
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS