బాలిక పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Sat,April 8, 2017 11:33 AM

Student harass by Teacher in a Private School

హైదరాబాద్ : ఉప్పల్ భరత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి బాలిక పట్ల ఓ ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. టీచర్ తీరును నిరసిస్తూ పాఠశాలలో బాలిక తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బాధిత బాలిక చేత చెప్పుతో ఉపాధ్యాయుడిని కొట్టించింది తల్లి. ఆ తర్వాత విద్యార్థిని తల్లిదండ్రులిద్దరూ టీచర్‌ను చితకబాదారు. స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1027
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles