తల్లి మందలింపు.. కొడుకు ఆత్మహత్య

Sat,March 9, 2019 07:04 AM

Son got suicide due to mother scold in Secunderabad

సికింద్రాబాద్ : పెరుగు తీసుకురానందుకు తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్ చేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని బోయిన్‌పల్లి ఎస్సై రఘువీర్‌రెడ్డి కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వివేక్(24) కుటుంబం కొన్నేండ్ల క్రితమే నగరానికి వచ్చి చింతల్‌లో స్థిరపడింది. ప్రస్తుతం వివేక్ బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో కలెక్షన్ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే వివేక్ తల్లి సమతి అతడిని దుకాణానికి వెళ్లి పెరుగు తీసుకురమ్మని చెప్పింది. వివేక్ ఎంతకు పెరుగు తీసుకురాకపోవడంతో సుమతి అతడిని మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వివేక్ శుక్రవారం మధ్యాహ్నం డైరీ ఫారం క్రాస్ రోడ్డు నుంచి రైల్వే బ్రిడ్జి గుండా చింతల్, దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లే దారిలో ఉన్న నిర్మాణుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. తన స్నేహితుడు శివకు వీడియో కాల్ చేసి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles