సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య..

Mon,October 14, 2019 11:01 PM

హైదరాబాద్‌: గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. రఘురాం(35) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా అతడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తీవ్ర మనోవేదనకు గురైన రఘురాం అపార్టుమెంట్‌ పైఅంతస్తు నుంచి దూకాడు. తీవ్ర రక్త స్రావమైన రఘురాం అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అతడి మరణానికి గల వివరాలను చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమర్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

1173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles