రెండు కార్లు ఢీకొని ఆరుగురు మృతి

Sun,December 30, 2018 03:09 PM

six people killed and 4 injured in a collision between two cars in Gadag

కర్ణాటక: రాష్ట్రంలోని గడగ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోద చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కొప్పల్‌లో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులు ధార్వడ్ జిల్లాకు చెందిన ఆనంద్, సిద్దూ కొరిశెట్టి, మనోజ్‌కుమార్ కారాడిగుడా, అమృత, చందు వాడత్‌లుగా గుర్తించారు.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles