చెట్టును ఢీకొట్టిన కారు : ఎస్‌ఐ మృతి

Sat,August 12, 2017 08:13 PM

SI deid in road accident at Himayath sagar

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలంలోని హిమాయత్‌సాగర్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ మృతి చెందగా, ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. వర్షానికి రోడ్డు సరిగా కనిపించకపోవడంతో కారు చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఎస్‌ఐ మహ్మద్‌ఖలీల్ పాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఖలీల్ పాషా అప్పాలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. గాయపడిన వారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

931
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles