షీ వెంటపడి.. దొరికిపోయారు

Sun,February 24, 2019 07:12 AM

she teams arrested 63 eve teasers in hyderabad

హైదరాబాద్: ఆరు వారాల్లో 63 మంది పోకిరీలపై బాధిత యువతులు, మహిళలు, విద్యార్థినులు రాచకొండ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై విచారణ జరిపిన షీ టీమ్స్ 31 ఎఫ్‌ఐఆర్‌లు, 25 పెట్టీ కేసులు, 8 కౌన్సెలింగ్ కేసులను నమోదు చేసింది. ఇందులో 46 మంది మేజర్లు, 17 మంది మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిందరికీ శనివారం ఎల్బీనగర్ పోలీస్ క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల సమక్షంలో మానసిక నిఫుణులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, షీ టీమ్స్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరు వారాల్లో షీ టీమ్స్‌కు చిక్కిన పలు ముఖ్యమైన సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి...
విద్యార్థినికి టీచర్ వేధింపులు..
పహాడీషరీఫ్ ప్రాంతంలోని ఓ విద్యార్థినికి జె.వెంకటరాములు టీచర్ పరిచయమై య్యాడు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడంతో విషయం తెలుసుకుని తల్లి దండ్రులు అతన్ని మందలించారు. ఇక విద్యార్థిని జోలికి రానని క్షమించమని కోరాడు. తిరిగి... 2 నెలల నుంచి ఐ లవ్ యూ...ఐ మిస్ యూ అంటూ ఆమె వెంటపడుతున్నాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు షీ టీమ్స్ దృష్టికి తీసుకు వెళ్లారు. పహాడీషరీఫ్ పోలీసులు అతన్ని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
టీచర్‌ను వేధించిన బైక్‌రైడర్..
చైతన్యపురి పండ్ల మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ ప్రభుత్వ టీచర్‌ను ఓ వ్యక్తి బైక్‌పై వెంటపడుతూ ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు. ఇటీవల ఈ వేధింపులు ఎక్కవకావడంతో బాధితురాలు ఎల్బీనగర్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీ టీమ్స్ ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తి చేష్టలను వీడియో రికార్డు చేసి అతన్ని అందుపులోకి తీసుకున్నారు. విచారణలో అతని పేరు కొమ్మరాజు వెంకటేశ్వర రావుగా గుర్తించి, అతన్ని చైతన్యపురి పీఎస్ నుంచి రిమాండ్‌కు తరలించారు.
పెండ్లి చేసుకోకపోతే... ఫొటోలు బయటపెడతా..
ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి శివానీ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. ఆమెకు మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన శీలం శ్రీనివాస్ పరిచయమైయ్యాడు. ఇద్దరు స్నేహితులుగా సన్నిహితంగా ఉన్నారు. కలిసి ఫొటోలు దిగారు. పెండ్లి చేసుకుందామనుకున్నారు. ఇంతలో శ్రీనివాస్ మోసగాడని తెలుసుకుని పెండ్లి వద్దనుకుంది. అతనితో దూరంగా ఉంటుంది. ఈ విషయంపై యువతిపై కోపం పెంచుకుని... పెండ్లి చేసుకోకపోతే కలిసి దిగిన ఫొటోలను బయపెట్టి అల్లరి చేస్తానని బెదిరించాడు. దీంతో యువతి షీ ఫర్ హర్ టీమ్ ద్వారా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు.
అలాగే మల్కాజిగిరి, కుషాయిగూడ షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి బస్టాప్‌లు, షాపింగ్ ప్రాంతాలు, కాలేజీల వద్ద అల్లరి చేష్టలు చేస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఈ ఆరువారాల్లో షీ టీమ్స్ మొత్తం ఐదు బాల్య వివాహాలను అడ్డుకుని... మైనర్ యువతులకు మెరుగైన భవిష్యత్తుకు మా ర్గాన్ని చూపించింది. మహిళలు, యువతులు , విద్యార్థినులు తమపై జరిగే అఘా త్యాలపై మౌనంగా ఉండకుండా రాచకొండ వాట్సాప్ ఫోన్: 9490617111 లేదా డయల్ 100కు ఫిర్యాదు చేయాలని సీపీ మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు.

1871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles