డెత్ క్లెయిమ్‌ల పేరిట రూ. 3 కోట్లు స్వాహా

Thu,June 6, 2019 07:50 AM

Rs. 3 crores fraud in the name of Death Claims

కోదాడ: ఎల్‌ఐసీ ఏజెంట్లు, సంస్థలో పని చేసే ఉద్యోగులు కుమ్మక్కై భారీ మోసానికి తెరలేపారు. బతికున్న వారికే మరణ ధ్రువపత్రాలు తీసుకొచ్చి రూ.కోట్లు దోచుకున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ జీవిత బీమా సంస్థలో పని చేసి ప్రస్తుతం ఆదిలాబాద్‌కు బదిలీ అయిన ఎల్‌ఐసీ ఉద్యోగులు బీబీనాయక్, హరినాయక్, ఏజెంట్లు రఘుచారి, కొండయ్య, సురేశ్, ధనమూర్తి, సురేందర్‌రెడ్డి, విజయకుమారి, సైదాచారి, వెంకన్న, రవితో కుమ్మక్కై బతికి ఉన్న 190 మంది చనిపోయినట్టు నకిలీ ధ్రువపత్రాలతో రూ.3 కోట్ల దాకా దండుకున్నారు. ఇక్కడే సుదీర్ఘంగా ఏజెంట్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఏకంగా తనే మృతి చెందినట్టు నకిలీ పత్రాలు సృష్టించుకొని రూ.9 లక్షలను తన ఖాతాలోకే మళ్లించుకున్నాడు. సీబీఐ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి మంగళవారం హైదరాబాద్‌లోని పలువురు ఏజెంట్లు, ఉద్యోగుల ఇండ్లల్లో తనిఖీలు చేపట్టి కీలకపత్రానలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఏల్‌ఐసీ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు ఏజెంట్ల లైసెన్స్‌ను రద్దు చేసింది.

750
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles