బయోడిజిల్ డీలర్‌షీప్ అంటూ రూ. 2 కోట్ల మోసం

Sun,April 28, 2019 06:48 AM

Rs. 2 crore fraud in the name of Biodiesel dealership

హైదరాబాద్: బయోడిజిల్ డీలర్‌షిప్ ఇప్పిస్తానంటూ నమ్మించి ఓ మహిళకు రూ. 2 కోట్లు మోసం చేసిన ఘటనలో ముంబైకి చెందిన పరాగ్ రాంచంద్ర కామత్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం... ముంబైకి చెందిన మై ఓన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంతోష్ వర్మ మేనేజింగ్ డైరెక్టర్, మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. తాము బయో డిజిల్ ఫ్యూయల్ స్టేషన్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సంబంధించిన డీలర్‌షిప్‌లు ఇస్తామని, అందుకు సంబంధించిన బంక్‌లకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తామంటూ నమ్మించారు. దీంతో నగరానికి చెందిన కె.ప్రతిభ, మరికొందరు ఈ కంపెనీ నిర్వాహకుల మాటలు నమ్మారు. దీంతో వీళ్ల వద్ద నుంచి కంపెనీ రూ. 2 కోట్ల వరకు వసూలు చేసి, ఆ డబ్బును దుర్వినియోగం చేశారంటూ బాధితులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి, ఈ కేసుతో సంబంధమున్న రెండో నిందితుడైన పరాగ్ రాంచంద్ర ను ముంబైలో అరెస్ట్ చేసి నగరానికి తరలించి, స్థానిక న్యాయస్థానంలో నిందితుడిని హాజరుపరిచామని జాయింట్ సీపీ వెల్లడించారు.

1046
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles