వివాహితపై లైంగికదాడి

Fri,November 8, 2019 10:03 PM

వేములవాడ రూరల్: వివాహితపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ పట్టణ సీఐ వెంకటస్వామి వెల్లడించారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. వేములవాడ మండలం సంకెపల్లి గ్రామానికి చెందిన ఓ వివాహిత గురువారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వెళ్తున్నది. గ్రామ శివారుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన నాగుల పరశురాములుతో పాటు మరొకరు ఆమెను అడ్డగించి, నోట్లో గుడ్డలు కుక్కి ద్విచక్రవాహనంపై బలవంతంగా సమీప గుట్ట ప్రాంతానికి తీసుకెళ్లారు. మొదటగా రాములు లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆయన వెంట వచ్చిన మరొక గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి యత్నించగా మహిళ ప్రతిఘటించింది. అక్కడి నుంచి తప్పించుకొని ఇంటికి చేరింది. విషయాన్ని బంధువులకు తెలిపి, వారితో కలిసి పోలీసులను అశ్రయించింది. ఈ మేరకు బాధిత వివాహిత ఫిర్యాదు చేయగా నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకటస్వామి పేర్కొన్నారు.

2384
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles