రవిప్రకాష్‌ని విచారిస్తే ఆధారాలు లభిస్తాయి: పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

Mon,October 14, 2019 08:41 PM

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌ని విచారిస్తే అతడు చేసిన తప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ బయటకొస్తాయని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అన్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి. టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా రవిప్రకాష్‌ రూ. 18 కోట్లు డ్రా చేసినట్లు ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఈ కేసులో రవిప్రకాష్‌ రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. రవిప్రకాష్‌ని పదిరోజుల పాటు కస్టడీకి అనుమతిస్తే వివరాలన్నీ బయట పడతాయని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును అనుమతి కోరారు. అయితే రవిప్రకాష్‌ కస్టడీ పిటిషన్‌ తీర్పుపై కోర్టు రేపటికి వాయిదా వేసింది.

1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles