విదేశీ పెండ్లి కుమారులే టార్గెట్‌గా మోసాలు

Wed,June 19, 2019 06:49 AM

Overseas bridegrooms are the Target for frouds

హైదరాబాద్: విదేశీ పెండ్లి కుమారులను మోసం చేస్తున్న లెక్చరర్ అర్చనను మంగళవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఇంతకు ముందు మరోకేసులో ఆమెను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. రాచకొండ సైబర్ క్రైం పోలీసుల కథనం...అమెరికాలో నివాసం ఉంటున్న సాఫ్‌వేర్ ఇంజినీర్ సింహాద్రి భారత్ మ్యాట్రిమోని వెబ్‌సైట్ యువతి ప్రొఫైల్ చూసి వివాహం చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఇద్దరు అభిప్రాయాలు కుదరడంతో వివాహానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో అర్చన.. సింహాద్రికి వాట్సాప్‌లో ఫోన్ చేసి అమెరికాలోని వెస్ట్ పామ్ ప్రాంతంలోని సిస్కో కంపెనీలో ఉద్యోగం అవకాశం ఉంది. తాను అక్కడికి మారుతాను. లగేజీ షిఫ్టింగ్ కోసం కొంత డబ్బు కావాలి.. పంపించాలని కోరింది. వెంటనే 2900 డాలర్లు(ఇండియన్ కరెన్సీ 4 లక్షలు)ను అర్చన యాక్సిస్ బ్యాంక్ ఖాతాలో వేశాడు. ఆ తర్వాత.. ఆమె సింహాద్రి ఫోన్‌లకు స్పందించకపోవడంతో అనుమానించాడు. మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను ఆరా తీయగా అది నకిలీదిగా తేలింది.

డబ్బు బదిలీ అయిన ఖాతాను పరిశీలించగా అది ఎల్బీనగర్ ప్రాంతంలోని ఆంజనేయిలు పేరుతో ఉందని గుర్తించాడు. వెంటనే అతను బంధువు మధుమోహన్‌కు తెలుపగా.. అతను రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు పట్టుబడినప్పుడు ఈ నేరాన్ని కూడా ఆమె అంగీకరించింది. దీంతో రాచకొండ పోలీసులు జైలులో ఉన్న ఆమెను పీటీ వారెంట్‌పై తీసుకుని మంగళవారం అరెస్ట్ చేసి మళ్లి జైలుకు పంపారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన అర్చన లెక్చర్ వృత్తిలో ఉంది. 2016 నుంచి ఆమె విదేశీ పెండ్లి కుమారులను టార్గెట్ చేసుకుని మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి బోల్తా కొట్టిస్తుంది. ఇలా పలు కేసుల్లో అరస్టైన ఆమె ఐదు నెలల పాటు చంచల్‌గూడ జైలులో ఉంది. గూగుల్ నుంచి ఇతరుల ఫొటోలు, యాప్‌ల ద్వారా వాయిస్‌లను మార్చి మాట్లాడుతూ అందర్నీ మాయ చేసి లక్షలాది రూపాయలను కొట్టేసిందని పోలీసు దర్యాప్తులో తేలింది.

1594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles