పాత నేరస్తుడు అరెస్ట్.. 6 బైకులు స్వాధీనం

Sun,August 13, 2017 06:07 AM

old criminal arrest in old city

హైదరాబాద్ : ఇంటి ముందు పార్కు చేసిన బైకులను చోరీ చేస్తూ తప్పించుకుతిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని కంచన్‌బాగ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీఐ శంకర్ కథనం ప్రకారం.. భవానీనగర్ లో నివసించే మహ్మద్ రహిముల్లా(39) టైలరింగ్ పనిచేస్తున్నాడు. అయితే వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాల బాటపట్టాడు. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో అరెస్ట్ కావడంతో పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లాడు. 6 నెలల క్రితం జైలు నుంచి విడుదలైన రహిముల్లా కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2.5లక్షల విలువ గల 6 ద్విచక్రవాహనాలను చోరీ చేశాడు. శనివారం కంచన్‌బాగ్‌లో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా అతను పట్టుబడ్డాడు. విచారణలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. అతని నుంచి 6 బైక్‌లు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.

367
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles