పెండ్లయిన నాలుగు నెలలకే నవ దంపతుల బలవన్మరణం

Sun,June 16, 2019 07:02 AM

newly weds couple got suicide in Hyderabad

హైదరాబాద్: ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. నాలుగు నెలలకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. క్షణికావేశంతో యువజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...కరీంనగర్‌జిల్లా, గోదావరిఖని ప్రాంతానికి చెందిన బుర్రా సంతోశ్(25) బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ఎయిర్‌టెల్ స్టోర్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. మూడు, నాలుగు నెలల క్రితం అర్చన (22) అనే యువతిని ప్రేమ వివాహం చేసుకుని బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరామ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా.. వీరి పెండ్లికి సంతోశ్ కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపినా, అర్చన కుటుంబం మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి దూ రంగా ఉంది. మూడునెలలుగా ఆనందంగా ఉన్న దంపతుల మధ్య చిన్నచిన్న విభేదాలు ప్రారంభమయ్యాయి. వారంరోజుల క్రితం అర్చన కూడా ఓ స్టోర్‌లో ఉద్యోగంలో చేరినట్లు స్థానికులు తెలిపారు. కాగా... శనివారం ఉదయం నుంచి సంతోశ్, అర్చన గొడవపడ్డారు. ఉదయం 10 గంటల సమయంలో ఇంటి తలుపులు మూసుకున్న సంతోశ్, అర్చనలు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కాగా.. ఉదయం 11గంటలకు కూడా డ్యూటీకి సంతోశ్ రాకపోవడంతో అతను పనిచేస్తున్న స్టోర్‌తో పాటు అర్చన పనిచేస్తున్న స్టోర్‌నుంచి ఫోన్లు వ చ్చాయి. సాయంత్రం 3గంటల ప్రాంతంలో స్టోర్‌నుంచి సంతో శ్ ఇంటివద్దకు వచ్చి చూడగా సంతోశ్, అర్చనలు ఫాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అం దించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సంఘటనకు గల కారణాలపై స్పష్టత రాలేదని, మృతుల కుటుంబ సభ్యులు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

4659
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles