ఇంట్లో నిద్రిస్తున్న‌ యువకుడు కిడ్నాప్

Fri,April 26, 2019 09:31 PM

man kidnapped when he was in home

వెంగళరావునగ‌ర్: శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న‌ ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకుపోయిన సంఘటన బోరబండలో కలకలం రేపింది. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బోరబండ పెద్దమ్మనగర్‌కు చెందిన ఎల్లమ్మ జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె కుమారుడు పనన్ రోజువారీ కూలి పనులతో పాటు పెయిటింగ్ పని చేస్తుంటాడు. అయితే శుక్రవారం తెల్లవారు జామున 5.30 గంట‌ల స‌మ‌యంలో బ్లూ క‌ల‌ర్‌ కారులో వచ్చిన‌ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పవన్‌ను కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లినట్లు బాధితుని తల్లి ఎల్లమ్మ ఎస్సార్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పవన్‌ను విచారణ నిమిత్తం మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకువెళ్లారా..లేక గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారా అనేది విచారణలో తేలాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

2365
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles