పెండ్లి రోజు భార్య ఇంటికి రాలేదని..

Wed,June 19, 2019 06:29 AM

Man got suicide due to wife did not come home on their wedding day

హైదరాబాద్: భార్య పిల్లలకు దూరంగా ఉండటంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్రినాక ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. ఉప్పుగూడ మారుతీనగర్‌లో నివసించే ఆర్.శ్రీనివాస్ (54), దేవిక భార్యాభర్తలు. వీరికి 20 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు కుమార్తెలు. మూడు నెలల క్రితం దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. టైలర్ పని చేస్తూ శ్రీనివాస్ మారుతీనగర్‌లో, ఇద్దరు కుమార్తెలతో కలిసి దేవిక గౌలిపురాలో నివసిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ నెల 17న వీరి పెండ్లి రోజు కావడంతో శ్రీనివాస్ భార్యవద్దకు వచ్చి పిల్లలతో కలిసి ఇంటికి రమ్మని కోరాడు. అందుకు దేవిక ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ మంగళవారం ఒంటిపై కిరోసిన్ పొసుకొని నిప్పంటించుకున్నాడు. పోలీసులు శ్రీనివాస్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

6374
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles