ఆటోను ఢీకొన్న ఇసుక లారీ.. వ్యక్తి మృతి

Fri,April 12, 2019 02:30 PM

సూర్యాపేట: జిల్లాలోని శాలిగౌరారం మండలం పెరికకొండారం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటోను ఓ ఇసుక లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వెనుక భాగంలో నుల్చుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని నగేష్‌గా గుర్తించారు. అదేవిధంగా ఆటోలోని పలువురికి గాయాలయ్యాయి.


నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలోని ఉలెసైపాలెం గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతిచెంది పడిఉన్నాడు. సమాచారం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles