ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Thu,April 18, 2019 11:37 AM

మేడ్చల్: జిల్లాలోని ఉప్పల్ బస్‌స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. జనగామ ఆర్టీసీకి చెందిన బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న రామంతాపూర్‌కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని రామావత్ హరినాయక్(38)గా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.

555
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles