పదవి విరమణ డబ్బు కోసం తండ్రి హత్య

Tue,November 13, 2018 12:26 PM

హైదరాబాద్: పదవి విరమణ అనంతరం పొందిన డబ్బు ఇవ్వడం లేదని ఆగ్రహించి కన్నతండ్రినే సొంత కొడుకు కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. సీనియర్ పోలీసు అధికారి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే కృష్ణ అనే వ్యక్తి జూన్ 2017లో పదవి విరమణ పొందారు. ఈయనకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పదవి విరమణ పొందగా వచ్చిన రూ. 6 లక్షలు.. తన పేరుమీద ఉన్న ఓ ప్లాట్ అమ్మగా వచ్చిన రూ.10 లక్షలను ముగ్గురి సంతానానికి పంచి తన పేరుమీదా రూ. 2 జమ చేశాడు. కాగా కొద్దిరోజుల అనంతరం ఆ రెండు లక్షలు కూడా తనకు ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ కుమారుడు తరుణ్ తండ్రిని వేధింపులకు గురిచేశాడు. రాడ్‌తో తలపై కొట్టడంతో అపస్మారకస్థితిలోకి పోయాడు. దాడిని ఇద్దరు కూతుళ్లు సైతం ప్రోత్సహించారు. కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

2240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles