భార్యతో విడాకులు పొంది.. పిల్లలను ఎత్తుకెళ్లాడు!

Wed,February 6, 2019 08:37 AM

Man allegedly kidnapped 2 of his kids

మలక్‌పేట: భార్య నుంచి విడాకులు పొంది... ఇద్దరు పిల్లలను కిడ్నాప్ చేసిన వ్యక్తిని మలక్‌పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు కథనం ప్రకారం ...సలీంనగర్ తీగలగూడకు చెందిన రాఫత్‌బేగంకు చంచల్‌గూడకు చెందిన మహ్మద్ లతీఫ్‌ఖాన్‌తో 2005లో పెండ్లి జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు. ఇటీవల లతీఫ్‌ఖాన్ నిత్యం తాగివచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. దీంతో భర్త వేధింపులు భరించలేక రాఫత్‌బేగం గతేడాది నవంబర్ 21న శాలిబండలో ఖాజీల సమక్షంలో విడాకులు పొందింది. రాఫత్‌బేగం, పిల్లలతో తీగలగూడలో తల్లితో కలిసి ఉంటుంది. కాగా... ఈ నెల 13న మధ్యాహ్నం కిరాణం దుకాణంకు వెళ్లిన ఇద్దరు కుమారులను లతీఫ్‌ఖాన్ కిడ్నాప్ చేశాడు.

ఆందోళనకు గురైనా రాఫత్‌బేగం అన్నిచోట్లా వెదికింది. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో, మాజీ భర్తపై అనుమానాన్ని వ్యక్తంచేయడంతో, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నా రు. విచారణలో పిల్లలను తానే ఎత్తుకెళ్లానని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు పిల్లలను తల్లికి అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2300
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles