ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Tue,February 13, 2018 09:38 PM

Love couple Suicide attempt near kaleshwaram temple

కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లిజిల్లా కాళేశ్వరం దేవస్థానం సమీపంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో అమ్మాయి మృతి చెందగా, అబ్బాయి ఆస్పత్రిలో ప్రాణపాయస్థితిలో ఉన్నాడు. వరంగల్ జిల్లా హన్మకొండలోని సుబేదారికి చెందిన మెరుగు హరిప్రియ (17), పెండ్యాల సాయికుమార్ (18) ఇద్దరు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయి కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆలయ సమీపంలో ఇద్దరూ వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించారు.

దీంతో హరిప్రియ అక్కడికక్కడే మృతి చెందగా, సాయికుమార్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది హుటాహుటినా మహదేవపూర్‌కు తరలించారు. అప్పటికే హరిప్రియ మృతి చెందింది. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, అమ్మాయి మైనర్ కావడంతో సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో సాయికుమార్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సమాచారం.

2455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles