అనుమానస్పద స్థితిలో ప్రేమజంట సజీవదగ్ధం

Mon,March 18, 2019 09:26 PM

love couple died in suspicious states

కొత్తగూడెం : అనుమానస్పద స్థితిలో ప్రేమజంట సజీవ దగ్ధమైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు, బంధువులు, కాలనీవాసుల కథనం ప్రకారం.. రామాంజనేయ కాలనీకి చెందిన మాచర్ల వినోద్ (25) అలియాస్ దొంగ వినోద్ ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. యువకుడికి రెండేళ్ల క్రితం చమన్‌బస్తీకి చెందిన తేజస్విని (18) పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారింది.

వినోద్ పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి రామాంజనేయకాలనీ సబ్‌స్టేషన్ సమీపంలోని వినోద్ ఇంట్లోనే సహజీవనం ప్రారంభించారు. అప్పటి నుంచి తేజస్వినిని ఆమె తల్లిదండ్రులు చేరదీయలేదు. నెల రోజుల క్రితం తేజస్విని పుట్టింటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి వచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా వినోద్ నివసిస్తున్న ఇంట్లో ఒక్కసారిగా మంటలు వస్తుండటం గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు తీసి చూడగా యువతీ యువకులు సజీవ దగ్ధమై విగతజీవులుగా కనిపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ షేక్ మహమ్మద్ అలీ, చుంచుపల్లి తాటిపాముల కరుణాకర్, ఎస్సై లొడిగ రవీందర్ స్థానికులను విచారించారు. ఘటనపై మరిన్ని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. వినోద్ వ్యవహార శైలి సైకోని తలపించే విధంగా ఉంటుందని, ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగి తేజస్వినికి నిప్పంటించి హతమార్చాడని, ఆపై వినోద్ సైతం మంటల్లోకి వెళ్లి మృతి చెంది ఉంటాడని బాధితురాలి తండ్రి దేవదాస్ పోలీసుల ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనను పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా ఇతరుల పనా..? లేక వినోద్ స్వయంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

4240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles